TSPSC Group-3: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి నేడు, రేపు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్‌డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.