TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Cancelled Four Exams: ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్‌సీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్), ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), డీఏవో(డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్స్) పరీక్షలను రద్దు చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూన్ 11వ తేదీన మళ్లీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్ని గతేడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించగా.. మొత్తం 2 క్షల 86 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. ఏఈఈ పరీక్షలను ఈ ఏడాది జనవరి 22న నిర్వహించారు. 1540 పోస్టులకు గాను 61 వేల మంది పరీక్షలు రాశారు. డీఏవో ఎగ్జామ్‌ను ఫిబ్రవరి 26న నిర్వహించగా.. 53 పోస్టులకు ఏకంగా 67 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు గాను ఈనెల 5వ తేదీన పరీక్షలు జరగ్గా.. 55 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Sonali Kulkarni: అమ్మాయిలకు అది ఎక్కువైంది.. అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కావాలి
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
ప్రస్తుత పరిణామాలపై శుక్రవారం ఉదయం సమావేశమైన టీఎస్‌పీఎస్‌సీ.. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకొని.. ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు నిర్నయం తీసుకుంది. ఇప్పటికే టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను టీఎస్‌సీఎస్‌సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 175 పోస్టులకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, 185 పోస్టులకు వేటరినరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల్ని వాయిదా వేశారు. మరోవైపు.. మరికొన్ని పరీక్షలు ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్నాయి. హార్టికల్చర్ ఆఫీసర్స్ పరీక్షల్ని ఏప్రిల్ 4వ తేదీన జరగనుండగా.. ఏప్రిల్ 23న ఏఎంఐవీ, జులై 1న గ్రూప్ 4 (8180 పోస్టులకు 9 లక్షల దరఖాస్తులు), ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్ 2 (783 పోస్టులకు గాను 5 లక్షల 50 వేల దరఖాస్తులు) పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 3 (1375 పోస్టులకు 5 లక్షల 36 వేల దరఖాస్తులు) పరీక్షల తేదీ ఇంకా వెల్లడి కావల్సి ఉంది.
Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన
తాజావార్తలు
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!