గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల కోసం నాకు ఎక్కడ నుంచి అధికారిక ఇన్విటేషన్ రాలేదు అని ఆమె పేర్కొన్నారు. రాజ్ భవన్ మహిళలు మాత్రం నన్ను బోనాలకు ఆహ్వానించారు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదు అని గవర్నర్ తెలిపారు.
కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదు అని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్క సారి కూడా మెచ్చుకోలేదు అని గవర్నర్ పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Five AP villages appealed to Governor: భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం, ఏపీ…
నేను తమిళ ఆడబిడ్డను.. తెలంగాణకు అక్కను.. నేను మీతో ఉన్నాను.. మీ కుటుంబంలో ఒక సభ్యురాలని.. మీ సమస్యలు విన్నాను.. నేను మీతో ఉన్నాను కచ్చితంగా మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాను అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో తరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి భద్రాద్రి ఆలయం ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, దేవస్థానం వేద పండితులు.. పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.. ఆ తర్వాత దేవస్థానంలోని మూలవరులను దర్శించుకున్న ఆమె.. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో గవర్నర్‌కు దేవస్థానం…