ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ఇండియా కరోనా వ్యాక్సిన్ తయారు చేసి 160 దేశాలకు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నూతన ఆవిష్కరణలు తయారు చేయడంలో భారత దేశం ముందున్నదని, చిన్న చిన్న ఆలోచన లతో చేపట్టిన కార్యక్రమాలు నేడు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయన్నారు. భారతలో తయారైన వస్తువులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, తెలంగాణాలో తయారైన ఫార్మా పుదుచ్చేరికి ఇవ్వడం సంతోష దాయకం తెలంగాణా కు గర్వ కారణమన్నారు.
Also Read : బికినీలో బ్యాక్ చూపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. బాలయ్య, నాగ్ లతో నటించింది కూడా ?
భారత దేశం ఆహారపు అలవాట్లు, సాంప్రదాయాలు మెచ్చుకో తగ్గవి యువత వాటినే ఫాలో కావాలని, యువత చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు తమిళిసై. జీవితాన్ని ఎంజాయ్ చేయండి.. దేనికి భయపడవద్దు ధైర్యంగా ముందుకు సాగండని ఆమె వ్యాఖ్యానించారు. ఉన్న లక్ష్యాలతో అత్యున్నత శిఖరాలకు చేరుకోండని ఆమె అన్నారు. మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేయండి. ఈ దేశానికి సేవలందించండి.. భావి భారత పౌరులుగా ఎదగండి.. రాజకీయాల ను ఆస్వాదించండి…రాజకీయాల గురించి కూడా ఆలోచించండి’ అని ఆమె అన్నారు.
Also Read : Super Women : బాలీవుడ్‌లో ‘సూపర్ ఉమెన్’గా మీరా చోప్రా