Khairatabad Ganesh: వినాయక ఉత్సవాల మొదటి రోజే, హైదరాబాద్ నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా బీజేపీ కార్య కర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు, రాజాసింగ్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసేకుంది, నిరసనకారులను అరెస్టు చేసి, రాంగోపాల్ పేట్ ఠాణాకు తరలించారు. ఇవాళ ఖైరతాబాద్…
Governor Tamilisai to meet Basara IIIT students: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. వరసగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి…
హైదరాబాద్ రాజ్ భవన్ లో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులకు జాతీయ జెండాలను, దుస్తులను పంపిణీ చేసారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. 75 వ స్వతంత్ర దినోత్సవంను పండగగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. వర్షాల కారణంగా చాలా మంది ఇంట్లోని నిత్యవసర వస్తువులు కోల్పోయారు. ఈ సందర్భంగా వారికి బట్టలు ఇతర దుస్తులు అందించడం జరిగిందని పేర్కొన్నారు. జెండా తీసుకున్న ప్రతి…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇటీవలె వరద బాధితుల్ని పరామర్శించారు ఆమె. ఆదివాసీ మహిళ అత్యున్నత పీఠం అధిరోహించడం చారిత్రాత్మకం అంటూ ప్రసంశించారు. నామినేషన్ రోజు వరదల కారణంగా ఢిల్లీ వెళ్లలేకపోయా అంటూ తెలిపారు. వరదలు వచ్చాయి కాబట్టే ప్రభావిత ప్రాంతాల్లో తిరగానని అన్నారు. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని అన్నారు. అందుకే ఆదివాసీలు ఉన్న భద్రాచలం ఏరియాకు వెళ్లా అంటూ గవర్నర్ తెలిపారు. వర్షాలపై కేంద్ర హోంశాఖకు…
తమిళిసై సౌందర్ రాజన్.. క్లౌడ్ బరస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.
దాదాపు తొమ్మిది నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసియార్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. కీలక సందర్భాల్లోనూ అటు వైపు చూడకపోవడంతో దూరం మరింత పెరిగింది. కేబినెట్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉంచడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవలేదు. గవర్నర్ వెళ్లిన సమ్మక్క సారక్క జాతరలోనూ.. భద్రాచలం పర్యటనలోనూ ప్రొటోకాల్ కనపడలేదు. మంత్రులు…అధికారులు గవర్నర్ వచ్చే సమయానికి మాయం అయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని చెప్పుకొన్నారు. మరో అభ్యర్థిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో పంపిన తర్వాత ప్రభుత్వం గవర్నర్…