సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన కొనసాగుతుంది. కార్తీకమాసంలో మల్లికార్జున స్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని పూజలు చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళి సై తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్ తెలిపారు.
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదని స్పష్టం చేశారు. గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.