తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయగా.. గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. Read Also:…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. రాజ్‌భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
బాసర ట్రిపుల్ ఐటీలో గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు. తల్లిదండ్రుల కలలు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూసి తమిళిసై ఆవేదన చెందారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.…
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. అది ప్రజాదర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆయన అన్నారు. మహిళా దర్బార్ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సహజంగా ఎవరైనా ప్రతినిధి వస్సే కలవచ్చని.. వారిచే వినతిపత్రాన్ని తీసుకుని ప్రభుత్వానికి పంపవచ్చాన్నారు. కానీ రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ తమిళిసైకి తెలంగాణలో సీట్లు బ్లాక్ చేస్తున్నారని బహిరంగ లేఖ రాశారు. లేఖలో మంత్రులు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుందని, బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు. ఇలాంటి దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడుతున్నామని ఆయన తెలిపారు. ఒక్క సీటు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్…
గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతలు, ఇతర ప్రయివేటు వైద్య, విద్య కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు కోరుతూ రేవంత్ రెడ్డి లేఖను రాశారు. అయితే ప్రయివేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయన్నారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగస్వామ్యం కావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్,…
తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ తమిళిసై మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలు దూరం పెంచుతూ పోతున్నాయి.. ఇదే సమయంలో గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని.. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. అయితే, గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న…