Whats Today Updates 19.07.2022
1. ఏపీలో నేడు స్కూల్స్ బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీని నిరసిస్తూ బంద్‌కు పిలుపినిచ్చింది ఏబీవీపీ.
2. అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై పర్యటించనున్నారు.
3. నేడు ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం కానుంది. శ్రీలంక సంక్షోభం, తాజా పరిస్థితులపై చర్చించనున్నారు.
4. విపక్షాల ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా మార్గరేట్ ఆళ్వా నేడు నామినేషన్ వేయనున్నారు.
5. నేడు వెస్టిండీస్‌కు బయలుదేరనున్న టీమిండియా ఆటగాళ్లు. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్న భారత్.
6. నేడు ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయనున్నారు. రూ.137 కోట్లు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కొత్త లబ్దిదారుల ఖాతాల్లో జమకానున్న డబ్బులు.