ఆదిభట్ల యువతి కిడ్నాప్‌పై గవర్నర్ తమిళిసై స్పందించారు. విషయం తెలిసి షాక్‌కి గురయ్యానని ట్వీట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ ద్వారా డీజీపీని కోరారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించాలి గవర్నర్ తమిళిసై ట్వీట్టర్ పోస్ట్ చేశారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసై పై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ఒక ఫేక్ ఫ్రాడ్ ఎంపీ అంటూ ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఎద్దేవ చేశారు. గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని ఆరోపించారు.