Praja Palana Celebration : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తొలి ఏడాది నుంచి ప్రజా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా క్రమశిక్షణను పాటించింది. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను…