తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటాన్నారు. రాష్ట్రలో ఎన్నికల కోడ్ ముగియడంతో, ఈ కార్యక్రమం పునఃప్రారంభమైందని ప్రజావాణి ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్ జి. చిన్నారెడ్డి తెలిపారు. ప్రజల అభ్యర్థనలను ఇవాళ అంగీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్ప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని... ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజలు అడిగేది పథకాలు.. పత్రాలు కాదని జగదీష్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు లేకుండా... దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం…
పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీవో కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం కోసం, జవాబుదారితనంతో పనిచేస్తుందన్నారు. వ్యక్తుల కోసం కాదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా.. సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Vizag Capital: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. విశాఖ నుంచి పరిపాలన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి…