నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన మలినేని గోపీచంద్… నందమూరి బాలకృష్ణ సినిమా కోసం తానే వాస్తవ సంఘటనల ఆధారంగా కథను తయారు చేసుకున్నారు. అయితే… ఒకటి రెండు రోజులుగా ఈ సినిమాకు…
రాష్ట్ర రాజధాని ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి విషయాలను నేరుగా పొలిటికల్ లీడర్స్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం లభించింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అంశాలను సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకుల దృష్టిని తీసుకెళ్తూ పలువురు సెలెబ్రిటీలు తమవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా 600 కుటుంబాలు నివసించే…
నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో చెన్నై చంద్రం త్రిష కృష్ణన్ రొమాన్స్ చేయనుంది. 2015లో వచ్చిన “లయన్” సినిమాలో బాలకృష్ణ, త్రిష జంటగా కన్పించారు. ఆ తరువాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి కన్పించడం ఇది రెండవసారి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో త్రిష గృహిణిగా కన్పించబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో త్రిష కృష్ణన్ బాలయ్య…
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “అఖండ” సినిమాను పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు పెట్టని ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి సినిమాల మాదిరిగానే నిజమైన సంఘటనల ఆధారంగా బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఈ ప్రాజెక్ట్ కు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ…
నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే ఫుల్ గా హైప్ పెంచేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ సినిమా కథ గురించి తన పరిశోధనల అనంతరం స్క్రిప్ట్ ను…
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని మూవీ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు. క్రాక్తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన మలినేని గోపీచంద్… బాలకృష్ణ చిత్రానికి తానే కథను సైతం సమకూర్చు కుంటున్నాడు. క్రాక్ తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. విశేషం ఏమంటే……
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం ‘అఖండ’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయేలా గోపీచంద్ ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్ అంటున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య ఇద్దరు హీరోయిన్లతో…
త్రిష తెలుగులో చేసిన చివరి చిత్రం మీకు గుర్తుందా!? లేడీ ఓరియంటెడ్ హారర్ మూవీ నాయకిలో నటించింది. ఆ సినిమా వచ్చి అప్పుడే ఐదేళ్ళు గడిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని తమిళ చిత్రాలలో నటించిన త్రిష తెలుగులో వచ్చిన అవకాశాలను మాత్రం సున్నితంగా తిరస్కరించిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే 2015లో నందమూరి బాలకృష్ణ సరసన తొలిసారి లయన్లో నటించిన త్రిష… ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుతో జోడీ కట్టబోతోందని తెలుస్తోంది. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ… మలినేని…
‘క్రాక్’తో ఈ ఏడాది హిట్ కొట్టాడు దర్శకడు మలినేని గోపీచంద్. రవితేజ నటించిన ఈ సినిమా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ కి మంచి ఊపును ఇచ్చింది. అందులో హీరోయిన్ శ్రుతిహాసన్. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్. ‘క్రాక్’ హిట్ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను,…
గతంలో ఇతరుల కథలను తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేసిన మలినేని గోపీచంద్ ‘క్రాక్’ నుండి రూటు మార్చాడు. తానే తన చిత్రాలకు కథలను రాసుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ ఐడియాను తయారు చేసుకుని, రచయితల సహకారంతో దానిని డెవలప్ చేయిస్తున్నాడు. దాంతో కథ మీద గోపీచంద్ కు గ్రిప్ ఏర్పడటమే కాక, తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తీయగలుగుతున్నానా లేదా అనే జడ్జిమెంట్ కూడా షూటింగ్ సమయంలోనే వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే పని త్వరలో నందమూరి…