నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో చెన్నై చంద్రం త్రిష కృష్ణన్ రొమాన్స్ చేయనుంది. 2015లో వచ్చిన “లయన్” సినిమాలో బాలకృష్ణ, త్రిష జంటగా కన్పించారు. ఆ తరువాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి కన్పించడం ఇది రెండవసారి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో త్రిష గృహిణిగా కన్పించబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో త్రిష కృష్ణన్ బాలయ్య వైఫ్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also : “రాధేశ్యామ్” అప్డేట్… ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ మొర ఆలకించారా ?
గోపీచంద్ మలినేని త్రిషను సంప్రదించినప్పుడు ఆమె ఈ సినిమా కోసం పెద్ద సంఖ్యలో డేట్స్ కేటాయించడానికి అంగీకరించినట్లు సినిమా వర్గాల సమాచారం. అయితే ఆమె ఇంకా ఈ సినిమాకు సంతకం చేయలేదట. ఒకవేళ త్రిష ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనుక ఆమె ఐదేళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో రీఎంట్రీ ఇస్తున్నట్టు. 2016లో విడుదలైన హర్రర్ డ్రామా “నాయకి” తరువాత త్రిష మరో చిత్రంలో కన్పించలేదు.
ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ యాక్షన్ డ్రామా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కన్పించబోతున్నారు. బాలయ్య ఇదివరకు కూడా పోలీస్ పాత్రలను పోషించిన విషయం తెలిసిందే. దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరోవైపు బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “అఖండ” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది.