టాలీవుడ్ కు అచ్చిరాని నవంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కు నవంబర్ నెల ఏమాత్రం కలిసి రాలేదు. అంతకు ముందు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు నాన్ సీజన్‌గా పరిగణించేవారు. ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ లేకపోవడంతో నష్టాలూ ఎదురయ్యేవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అదే సమయంలో విద్యార్థులు పరీక్షలు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్‌లతో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి సాధారణ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లేందుకు తక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని ఈ ఏడాది విడుదలైన ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’ చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు అద్బుతంగా వచ్చాయి. కాబట్టి వచ్చే ఏడాది మెగాస్టార్ ‘ఆచార్య’ ‘ఎఫ్ 3’, ‘మేజర్’ వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాలు అదే సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధం అయ్యాయి.
Read Also : చొక్కాలు చించుకుని… గోపీచంద్ మలినేని ఎమోషనల్ పోస్ట్
Also Read
అయితే ఇప్పుడు నవంబర్ నెల నాన్ సీజన్ అనిపించేలా చేసింది. ఇంతకుముందు కూడా టాలీవుడ్ లో నవంబర్ నెలలో విడుదలైన చిత్రాలకు దారుణమైన స్పందన వచ్చింది. కలెక్షన్లు కూడా చాలా డల్‌గా ఉన్నాయి. ఈ నవంబర్‌లో అదే జరిగింది. దీపావళికి విడుదలైన ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను పొందలేదు. మంచి రోజులొచ్చాయి, పెద్దన్న, ఎనిమీ, పుష్పక విమానం, రాజా విక్రమార్క, కురుప్ ఇప్పటి వరకు నవంబర్ లో విడుదలైన చిత్రాలు. ఇందులో ఏ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వచ్చే వారం తక్కువ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందులోనూ ఒక్క సినిమా కూడా పెద్దగా బజ్‌ని క్రియేట్ చేయడం లేదు.
కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి, రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ నవంబర్ చివరి వారంలో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ట్రేడ్ విశ్లేషకులు నవంబర్ టాలీవుడ్ కు కలిసిరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ డిసెంబర్ మొదటి వారంలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విడుదలతో బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఒకదాని తర్వాత ఒకటి పెద్ద సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!