ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ లను అరికట్టడానికి.. అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల దర్యాప్తుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది. Also Read:Fire Accident In Vizag: విశాఖలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ 100 కోట్ల…
CM Revanth Reddy : సైబర్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు గూగుల్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్‌సిటీ దివ్యశ్రీ భవన్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది భారత్‌లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం విశేషం. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో…
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ తో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఏఐ యాంకర్స్, ఏఐ డాక్టర్స్ ఇలా ప్రతీ రంగంలో ఏఐ వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సరికొత్త ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టారు. దీని సాయంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం సులభంగా మారుతోంది. అద్దె ఇళ్లు వెతకడం కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. దీని ద్వారా యూజర్లు జెమిని ఏఐతో వివిధ పనులు…
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు, పరిష్కారాలు అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వ్యూహాత్మక సహకారం అందించనుంది. టీ హబ్‌లో గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ…
Machine Learning Course: ప్రపంచంలోనే అగ్రగణ్యమైన సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్. టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే వాళ్ల కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చింది గూగుల్. “మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్స్ (MLCC)” అనే ఉచిత ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్‌కి అనుకూలంగా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ (ML) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ఒక ప్రధాన భాగం. దీని ద్వారా…
Google : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్, భారతదేశంలోని వరాహా అనే స్టార్టప్‌తో కార్బన్ డయాక్సైడ్ తొలగింపు (CDR) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ వరాహా నుండి కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేస్తుంది. వరాహా వ్యవసాయ వ్యర్థాలను బయోచార్గా మార్చే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. బయోచార్ అనేది బొగ్గు ఒక రూపం, ఇది వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను సేకరించి మట్టిలో నిల్వ చేస్తుంది. గూగుల్, వరాహా మధ్య కుదిరిన ఈ ఒప్పందం…
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. టెలికాం కంపెనీలు తక్కువు ధరలోనే డేటా అందిస్తుండడంతో ఇంటర్ నెట్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్లీ పడుకునేంత వరకు ఫోన్ తోనే గడుపుతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే క్షణం గడవలేని పరిస్థితి దాపరించింది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లోనే వెతకడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సార్లు మంచి విషయాలతో పాటు చెడు విషయాలను తెలుసుకునేందుకు కూడా గూగుల్ ను వాడుతుంటారు.…
Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను…
హార్డ్ వర్క్ ముఖ్యం కాదని, స్మార్ట్ వర్క్ కావాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలన్నారు. ఓటే దేశాన్ని ఇంతవరకూ కాపాడుతూ వస్తోందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరిందని, మంత్రి నారా లోకేశ్ కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.…