గూగుల్ యొక్క AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను తొలగించినట్లు వైర్డ్ నివేదించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో తొలగింపులు కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు నెలలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్, తాజాగా 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. . AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను గూగుల్ తొలగించింది. గూగుల్ యొక్క జెమిని నుండి వచ్చిన ప్రతిస్పందనలను సమీక్షించడం, సవరించడం, గూగుల్ సెర్చ్ కోసం AI- జనరేటెడ్ సారాంశాలను మెరుగుపర్చడం వంటి పనులపై కాంట్రాక్టర్లు పనిచేశారు. లేఆఫ్‌కు గురైన వారు జెమిని, ఏఐ టూల్స్ ప్రాజెక్టులలో ఉన్నవారే కావడం గమనార్హం. అయితే, ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు హెచ్చరిక ఇవ్వకుండానే తమను ఉద్యోగాల నుంచి తొలగంచారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.