Solar Eclipse: గూగుల్ మరోసారి వినియోగదారులను అబ్బుర పరిచింది. “సూర్య గ్రహణం” లేదా ‘Solar Eclipse’ అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేస్తే ఒక ప్రత్యేక, ఇంటరాక్టివ్ యానిమేషన్‌ను చూడవచ్చు. ఈ ఆన్‌లైన్ ఫీచర్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. వినియోగదారులు తమ స్క్రీన్‌లో కనిపించే యానిమేషన్‌ను షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రహణ సమయంలో గూగుల్ ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది.
HYDRA Commissioner: గాజులరామారంలో కూల్చివేతలపై మరోసారి స్పందించిన హైడ్రా కమిషనర్..
ఈసారి “Solar Eclipse” అని సెర్చ్‌లో టైప్ చేసిన వెంటనే, చంద్రుడు సూర్యునిపైకి వస్తున్నట్లుగా కనిపించే చిన్న యానిమేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ యానిమేషన్‌తో పాటు, గ్రహణం గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వబడింది. గూగుల్ ముఖ్యమైన సంఘటనలు, పండుగలు లేదా శాస్త్రీయ ప్రక్రియలను వినియోగదారులకు మరింత ఆకట్టుకునే విధంగా చూపించడానికి తరచుగా ప్రత్యేక ఫీచర్లను రూపొందిస్తుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు కేవలం ఆసక్తికరంగా ఉంచడమే కాకుండా.. గ్రహణాలపై అవగాహనను పెంచి, ఖగోళ శాస్త్రం పట్ల యువతలో అవగహన కలిగిస్తుంది.
200MP టెలిఫోటో కెమెరా, 7,000mAh బ్యాటరీలతో వచ్చేస్తున్న Realme GT 8 Series!
ఇది ఇంకా చూడకపోతే.. గూగుల్ సెర్చ్‌లో “సూర్య గ్రహణం” లేదా “Solar Eclipse”అని టైప్ చేయండి. అంతే మీ స్క్రీన్‌పై యానిమేషన్ చూడవచ్చు. అంతేకాదు ఆ తర్వాత గ్రహణం తేదీలు, సమయాలు, శాస్త్రీయ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం సెర్చ్ మొదలు పెట్టండి.