Google Doodle: మనం నిత్యం ఉపయోగించే గూగుల్.. ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చిందంటే చాలు.. ఆ రోజు విశిష్టతను తెలిపేలా డూడుల్ రూపొందిస్తూ ఉంటుంది.. అయితే, ఈ రోజు రూపొందించిన డూడుల్ ఆసక్తికరంగా మారింది.. గణిత ఔత్సాహికులు ఈరోజే Google ని చూడటానికి ఇష్టపడతారు! ఎందుకో ఆలోచిస్తున్నారా? హోమ్‌పేజీ విస్తృతంగా ఉపయోగించడానికి కూడా ఆసక్తి చూపుతారు.. ఎందుకంటే.. ax2+bx+c=0! అనే సూత్రం వచ్చేలా తాజాగా డూడుల్ రూపొందించింది గూడుల్.. ఇది ఇంజనీరింగ్, ఆర్థిక శాస్త్రం మరియు భౌతిక…
Google Doodle: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్…
Google Doodle: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పండగ ఈ రోజు ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 97 కోట్ల ఓటర్లను కలిగిన అతిపెద్ద ఎన్నికలుగా ఈ ఎన్నికలు చెప్పబడుతున్నాయి.
ప్రముఖ మెక్సికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ మారియో మోలినా 80వ జన్మదిన వేడుకను గూగుల్ ఆదివారం నాడు కలర్‌ఫుల్ డూడుల్‌తో జరుపుకుంది. రసాయన శాస్త్రంలో 1995 నోబెల్ బహుమతి సహ-గ్రహీత, మారియో మోలినా ఓజోన్ పొరను రక్షించడానికి కలిసి రావాలని ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించిన ఘనతను పొందారు.
Google Doodle: మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది గూగుల్.
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి…