Silent Mode Phone: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్‌కు ఎంత ప్రాధాన్యత ఉందొ తెలియనిదా.? కొద్దిసేపు కూడా దాన్ని కనుచూపు మేరలో ఉంచుకోవడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచి ఎక్కడైనా మరచిపోతే దాన్ని కనుగొనడం మరింత కష్టమవుతుంది. ఇది మరొక ఫోన్ నుండి రింగ్ అయినప్పుడు కూడా గుర్తించబడదు. అటువంటి పరిస్థితిలో, సైలెంట్ మోడ్‌లో ఫోన్ పోయినట్లయితే దాన్ని ఎలా గుర్తించాలో చూద్దాం. Rape D OTT: నేరుగా ఓటీటీలోకి…
Google Account Storage Full : మీరు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలు వంటి గూగుల్ సేవలను తరచుగా ఉపయోగిస్తుంటే.. మీ గూగుల్ ఖాతా స్టోరేజ్ ఫుల్ అయిందని సందేశాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యంగా మీరు పని లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ సేవలపై ఆధారపడితే ఇది నిరాశపరిచే అనుభవం కావచ్చు. అయితే, స్టోరేజ్ ఖాళీ చేయడానికి, మీ గూగుల్ ఖాతాను అంతరాయం లేకుండా ఉపయోగించడం కొనసాగించడానికి మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఇలా…
Google: వచ్చే నెలలో గూగుల్ తన Gmail అకౌంట్లను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్లు డీయాక్టివేట్ కాబోతున్నాయి. రెండేళ్లుగా తమ అకౌంట్లను వాడకుంటే వాటిని డీయాక్టివ్ చేసే ప్రమాదం ఉంది. మే నెలలో గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ రాసిన బ్లాగులో.. రిస్క్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గూగుల్ ఖాతాల కోసం మా ఇన్‌యాక్టివిటీ విధానాన్ని 2 ఏళ్లకు అప్‌డేట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. చాలా కాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ యూజర్లకు గూగుల్ మెయిల్ ద్వారా వార్నింగ్ మేసేజ్ ను పంపిస్తుంది.