Home
Good News
Good News News
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుండగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారని… వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన తెలిపారు.… -
గుడ్‌న్యూస్.. త్వరలోనే 1,125 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట కలిగించే వార్తను ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,125 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉండగా.. వీటికి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా మరో 8 జత కానున్నాయి. దీంతో మొత్తం 18 కాలేజీల్లో సహాయ ఆచార్యులను నియమించనున్నారు. Read Also: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. ‘సినతల్లి’కి ఇల్లు కట్టిస్తానని హామీ కొత్తగా నెలకొల్పనున్న… -
దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలతో పాటు వంటనూనెల రేట్లు మండిపోతుండటంతో సామాన్య ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గించింది. దీంతో దీపావళి పండగ వేళ దేశ ప్రజలకు వంట నూనెల తయారీ సంస్థలు శుభవార్త అందించాయి. అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ.4 నుంచి రూ.7 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. Read Also: ఒక సూర్యుడు,… -
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు
దేశంలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నూనెతో వంట చేసుకోవాలంటే అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ నేపథ్యంలో హోల్‌సేల్‌గా విక్రయించే లీటరు నూనెను రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించింది. నూనెల పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నా పండగ దృష్ట్యా వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. Read… -
కడప జిల్లా వాసులకు గుడ్‌న్యూస్
కడప వాసులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ అందించింది. నవంబర్ 1 నుంచి కడప మీదుగా మరో రెండు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని కడప రైల్వే సీసీఐ ఎం.యానాదయ్య వెల్లడించారు. ఈ రెండు రైళ్లు కడప జిల్లాలో పలు స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. ముంబై-చెన్నై మధ్య ప్రతిరోజూ నడిచే 01459 నంబరు గల రైలు ముంబైలో మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:59 గంటలకు కడప జిల్లా ఎర్రగుంట్లకు, ఉదయం 4:43 గంటలకు కడపకు,… -
గుడ్ న్యూస్ చెప్పిన క్రికెటర్ దినేష్ కార్తీక్
టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ అందించాడు. దినేష్ కార్తీక్, దీపిక పల్లికల్ జంటకు గురువారం నాడు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ముగ్గురం కాస్తా.. ఐదుగురం అయ్యాం. దీపిక, నేను ఇద్దరు అందమైన మగ పిల్లలతో ఆశీర్వాదం పొందాం. ఇంతకన్నా సంతోషంగా ఉండలేము’ అంటూ డీకే రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన కవల పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని… -
హైదరాబాద్: పార్కులకు వెళ్లేవారికి శుభవార్త
హైదరాబాద్ నగరంలో మీరు పార్కులకు వెళ్తున్నారా? అయితే మీ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుభవార్త తెలిపింది. సంజీవయ్య, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లే పర్యాటకుల వద్ద కెమెరాల కోసం ఇకపై ఫీజులు వసూలు చేయబోమని HMDA వెల్లడించింది. గతంలో ఈ మూడు పార్కుల్లోకి కెమెరాతో వెళ్తే అదనంగా రూ.1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని HMDA ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు… -
కరోనా గుడ్ న్యూస్ ..
ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్ వేవ్ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియా రిసెర్చ్ -ICMR తాజాగా ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా… -
రుణ మాఫీ పై కేబినెట్ లో కీలక నిర్ణయం…
వ్యవసాయం పై ఈరోజు తెలంగాణ కేబినెట్ లో చర్చించారు. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై… పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఇక రుణ మాఫీ పై కేబినెట్ లో చర్చిస్తూ… రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్… -
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపారు. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు నిధుల విషయంలో…
తాజావార్తలు
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
-
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!