రచయితగా సాహితీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అనే తెలిసి ఉండవచ్చు. కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరును గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈ నాటికీ పరవశం కలుగక మానదు. రచయితగా, కథకునిగా, నాటకరచయితగా, విలేఖరిగా, ఉపసంపాదకునిగా, సంపాదకునిగా పత్రికారంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో…