మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, ఈదురు గాలుల సమయంలో అప్పుడప్పుడు ఆకాశంలోనుంచి వడగళ్లు, చేపలు వంటివి కురుస్తుంటాయి. అయితే, ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలూకాలో ఓ రైతు పొలంలో పనిచేసుకుంటుండగా, ఒక్కసారిగి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఆకాశంలోనుంచి ఓ రాయి హటాత్తుగా ఈ రైతు పొలంలో పడింది. రైతుకు 8 అడుగుల దూరంలో పడిన ఆ రాయిని చూసి రైతు షాక్ అయ్యాడు.…