Gold ans Silver Prices: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం ఓ రకంగా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో శుభాకార్యాలు భారీస్థాయిలో జరుగుతాయి. దీంతో పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడికి రెక్కలు రావడంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించిన వాళ్లు ఊసురుమంటున్నారు. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితులు, బంగారం ధరల…
Business Headlines: పెరిగిన జీఎస్టీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. లేబుల్ వేసిన ఫుడ్ ఐటమ్స్‌తోపాటు రూమ్ రెంట్ ఐదు వేల రూపాయలకు పైగా ఉన్న ఆస్పత్రుల బిల్లులపై అదనంగా ఐదు శాతం జీఎస్టీని ఇవాళ్టి నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు బంగారం దాదాపు రూ.750 వరకు తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,600 తగ్గింది. ఈరోజు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. కిలో వెండి ధర రూ.63,4000గా ఉంది. తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా దాదాపు ఇవే ధరలు అమలవుతాయి. ఏపీలోని విశాఖ పట్నంలో…
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. సామాన్యులకు అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకుతున్నాయి.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. కమోటిటీ ఫ్యూచర్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం 54 వేల మార్క్ ను తాకింది. ఇంట్రాడేలో 54,190 రూపాయలకు వెళ్లింది. 24 క్యారెట్ల తులం బంగారం.. ఆల్ టైమ్ గరిష్టానికి 2వేల దూరంలో నిలిచిపోయింది. 2020 ఆగస్టులో 56,191 రూపాయలను తాకింది. ఇప్పటివరకు ఇదే జీవితకాల…
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయి. గురువారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై ముప్పేట దాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇండియాలో అయితే మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది. షేర్ హోల్డర్లు భయంతో షేర్లను అమ్మేస్తుండటంతో…
కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. Read Also: బీమా కంపెనీల…