పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. సామాన్యులకు అందనంత ఎత్తుకు ధరలు ఎగబాకుతున్నాయి.. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. కమోటిటీ ఫ్యూచర్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం 54 వేల మార్క్ ను తాకింది. ఇంట్రాడేలో 54,190 రూపాయలకు వెళ్లింది. 24 క్యారెట్ల తులం బంగారం.. ఆల్ టైమ్ గరిష్టానికి 2వేల దూరంలో నిలిచిపోయింది. 2020 ఆగస్టులో 56,191 రూపాయలను తాకింది. ఇప్పటివరకు ఇదే జీవితకాల గరిష్టం. మార్కెట్లు ముగిసే సమయానికి 54వేల దిగువకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 2,020 డాలర్లు దాటింది. హైదరాబాద్ లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,890 రూపాలు పలికింది. 22 క్యారెట్ల తులం బంగారం 49,400గా ఉంది.
Read Also: Chandrababu: త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు