ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.. ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు.. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో రూ. 2800 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.