మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గోబీ మంచురియా డిష్ పై గోవాలో భారీ గొడవలు జరుగుతున్నాయి. గోబీని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడం వల్ల ఈ డిష్‌లో ప్రమాదకర కలర్స్ వాడటంతో పాటు దుస్తులు ఉతకడానికి ఉపయోగించే పౌడర్‌ను సాస్ తయారీలో ఉపయోగించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది.