Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కృత్రిమ రంగుల వాడకం ఆరోగ్యానికి హానికరమని తేలిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో కృత్రిమ ఫుడ్ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. వీటిల్లో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్-బి అనే రసాయనం ఆరోగ్యానికి హానికరమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు మీడియాతో మాట్లాడారు. కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికరమైన రసాయనాలు ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆరోగ్య అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ఫుడ్ సెంటర్ల నుంచి 171 నమూనాలను సేకరించారని.. వాటిని పరీక్షించగా 107 పదార్థాల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలిందని చెప్పారు. వాటిల్లో రోడమైన్-బి, టాట్రజైన్ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారని.. ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.
రసాయనాలతో చేసే కలర్ గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురక్షితం కాని రసాయనాలను ఉపయోగించే ఫుడ్ సెంటర్లపై కూడా అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సును రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రంగులు వేయని తెల్లని పీచు మిఠాయి విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదని… వాటిని విక్రయాలు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా పీచు మిఠాయిపై నిషేధం విధించారు. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఆ దిశగా తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రోడమైన్-బిని దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ ఫుడ్ కలరింగ్‌కు మాత్రం ఉపయోగించకూడదు. దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు. ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!