ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు.. జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా ఉండేందుకు ఒకరికొరు ప్రమాణం చేసుకున్నారు.. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.. అంతే కాదు.. తన ప్రేయసి కోసం.. ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే దొంగగా మారాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో నిన్న జి.కె జ్యూవెలరీలో ఒడిశాకు చెందిన సూరజ్ కుమార్ కద్రకా చోరీకి పాల్పడ్డాడు. జ్యూవెలరీ షాప్ లోని వర్కర్స్ ను డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేశాడు. చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. పోలీస్ విచారణలో లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని సూరజ్ కుమార్ అంగీకరించాడు. చోరీ కోసం…
ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ లేదు. అలాగని చేసుకోరని చెప్పలేము. కొన్ని కారణాల వలన విడిపోవచ్చు… తిరిగి కలుసుకోవచ్చు. ఎప్పుడో 2016లో యునితా రురీ అనే యువతిని అక్బర్ కొరిక్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏమయిందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే, అక్బర్ కొరిక్ కు ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన నూర్ ఖుస్నాల్ తో వివాహం నిశ్చయమైంది. ఈ…
ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగింది. కామరాజ నగర్లోని ఆశిక్ (19) తన ఊరిలోనే ఓ అమ్మాయిని (17) ప్రేమించాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువతి ఆశిక్తో మాట్లాడటానికి నిరాకరించింది. మనోవేదనకు గురైన ఆశిక్.. ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి సైతం బలవన్మరణానికి పాల్పడింది.