Hong Kong vs India: ఒక్కసారిగా మారిన సీన్.. స్టేడియంలో గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన ఆల్‌రౌండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై దుమ్మురేపిన భారత్, అదే జోరు కొనసాగించింది. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో ఈజీగా విజయం సాధించింది. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన హాంకాంగ్, టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ ఇచ్చింది. 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది భారత్… ఇక 193 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన హాంకాంగ్, ఏమాత్రం నిలకడగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటిగా బంతులు విసిరి, బ్యాటర్లను కంట్రోల్ చేశారు. ఐదు వికెట్లు కోల్పోయిన హాంకాంగ్, 20 ఓవర్లల 152 పరుగులు చేసింది. దీంతో 40 పరుగుల తేడాతో హాంకాంగ్ పై విజయం సాధించింది టీంఇండియా. అయితే, మ్యాచ్ ఓడినా.. తన ప్రేయసి మనసు గెలిచాడు… హాంకాంగ్ క్రికెటర్.. స్టేడియంలోనే తన గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి ఒక్కసారిగా సీన్ మార్చేశాడు..
Read Also: Sonali Phogat: సోనాలీ ఫోగాట్ కేసులో మరో కొత్త ట్విస్ట్.. శరీరంపై 46 చోట్ల గాయాలు..
Also Read
హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కించిత్ షా స్టేడియంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేసి ఆమెను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశాడు.. ఈ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. ముంబైలో పుట్టిన కించిత్ మూడు నెలల వయసులో తల్లిదండ్రులతో కలిసి హాంకాంగ్ వెళ్లిపోయాడు. తండ్రి క్రికెట్ ఆడుతుండడాన్ని చూసి పదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. ఇక, బుధవారం రోజు భారత్ విజయం సాధించిన తర్వాత స్టేడియంలో నిల్చున్న తన గాళ్ ఫ్రెండ్ వద్దకు వెళ్లాడు కించిత్.. ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఉంగరం చూపించి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్న కించిత్‌ను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయిన అతడి ప్రేయసి.. మొదట ఆశ్చర్యానికి లోనైంది.. ఆ తర్వాత తేరుకుని వెంటనే తన అంగీకారాన్ని చెప్పేసింది.. ఎస్.. అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. ఆ వెంటనే రింగ్‌ను ఆమె ఫింగర్‌కు తొడగడం.. ఇద్దరూ కౌగిలించుకుని ఆనందంలో మునిగిపోవడం జరిగిపోయాయి.. ఇక, ప్రేక్షకులు తమ కెమెరాలు, సెల్‌ఫోన్లకు పనిచెప్పారు.. ఆ దృశ్యాలను మొబైన్లలో బంధించారు.. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.
ఆసియా కప్ 2022లో భారత్ చేతిలో హాంకాంగ్ 40 పరుగుల తేడాతో పరాజయం పాలైనప్పటికీ, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది… భారత్‌పై హాంకాంగ్ పోరాడిన తీరును అంతా ప్రశంసించగా.. వారు తమ జట్టు మరియు దేశానికి ఆటను చాలా గుర్తుండిపోయేలా చేశారు.. ఈ మ్యాచ్‌లో 193 పరుగుల ఛేదనలో, 26 ఏళ్ల కించిత్.. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసి 28 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతని స్కోరింగ్ రేటును పెంచే ప్రయత్నంలో, 18వ ఓవర్‌లో భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 43 టీ20లు ఆడి 20.42 సగటుతో 633 పరుగులు చేశాడు. టీ20ల్లో అతని అత్యధిక స్కోరు 79, అతను 2019లో ఐర్లాండ్‌పై స్కోర్ చేశాడు. ఇక, బౌలింగ్ వేసి తన కెరీల్‌లో 11 వికెట్లు కూడా సాధించాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!