పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “20 నుంచి 25 ఏళ్లు నగరంలో పీజేఆర్ శకం నడిచింది.. ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువుకు వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారు.. పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. మంత్రిగా నిరంతరం సేవ చేస్తూ.. పేదవారికి అండగా నిలబడ్డాడు.. సీఎల్పీ నాయకుడిగా కూడా పీజేఆర్ ఎనలేని సేవ చేశాడు.. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు…
Hyderabad: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం దగ్గర ధర్నా చేయనున్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు.
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్కు…
Indira Canteen : హైదరాబాద్ నగరంలోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇవి ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా పిలవబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి “అన్నపూర్ణ” పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి. Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి తర్వాత వచ్చిన బీఆర్ఎస్…
లంచం తీసుకోవడం నేరం అని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కావొచ్చేమో కొందరు ఉద్యోగులు లంచాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి వారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు రావడం లేదు. తాజాగా జిహెచ్ఎంసి గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. ఆమెనే అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా. Also Read:12 Marriages: నిత్య పెళ్లి కూతురు..!…
GHMC : హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ACP), 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పని…
High Court Serious: హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పిస్తూ, వారి వ్యవహార శైలిపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. ఒక భవన నిర్మాణ దారుడి పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు.. భవనం పూర్తయ్యేంతవరకూ మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. Read Also:…
Food Safety Raids : గోల్కొండ ఫోర్ట్ సమీపంలోని బడా బజార్ ప్రాంతంలో నిబంధనలకీ నాణ్యతకీ వ్యతిరేకంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టీమ్ అక్కడికి వెళ్లి తనిఖీలు చేసింది. కమిషనర్ ఆదేశాలతో జరిగిన ఈ తనిఖీల్లో అనేక అధ్వాన్న పరిస్థితులు బయటపడ్డాయి. ఆ సెంటర్కు సరైన లైసెన్స్ లేకపోవడమే కాక, చాలా అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు అక్కడ తయారీని నిలిపివేశారు.…
Bars Draw : తెలంగాణ రాష్ట్రంలో 28 కొత్త బార్లకు గాను ఈరోజు ఆబ్కారీ శాఖ లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసింది. ఈ లాటరీ ప్రక్రియ శుక్రవారం నార్సింగ్లోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ నేతృత్వంలో నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని నాలుగు బార్లకు మరో 148…
Heavy Rain: హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.