గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ముందుగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాకు కౌన్సిల్ సభ్యులు నివాళులు అర్పించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను రూ.8,340 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనపై బీజేపీ…
Non Veg : మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్బంగా రేపు (జనవరి 30) హైదరాబాద్ నగరంలో అన్ని మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మేక, గొర్రెల మండిలు, మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నాయి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. మాంసం దుకాణాలు…
Chakwadi Nala Break: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహాల్ పరిధిలోని చాక్వాడి వద్ద మరోసారి నాలా రోడ్డు కుంగిపోయింది. ఈ నాలా ఇప్పటికే నాలుగు సార్లు కుంగిపోగా.. మంగళవారం రాత్రి మరోసారి కుంగింది.
Minister Kishan Reddy: అంబర్పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నదని తెలిపారు. ఈ దిశగా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడి వచ్చేనెల 11కు నాలుగేళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట.
Madhavaram Krishna Rao : గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల…
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల…