GHMC Council Meeting: బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ మేయర్.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!
- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఆరంభం
- బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ మేయర్
- చర్చ లేకుండానే బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ముందుగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాకు కౌన్సిల్ సభ్యులు నివాళులు అర్పించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకుని ప్లకార్డులను చించేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో చర్చ లేకుండానే.. బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
మరోవైపు గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, ఉస్మానియా ఆసుపత్రిని అక్కడ నిర్మించొద్దంటూ బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్‌ఎంసీ కార్యాలయంకు వచ్చారు. బడ్జెట్ అనంతరం క్వశ్చన్ హవర్ ప్రారంభం అయింది. క్వశ్చన్ హవర్ ను బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. బయటకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను హౌజ్ లోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. తనపై బీఆర్ఎస్ సభ్యులు పేపర్లు విసిరారని మేయర్ ఫైర్ అయ్యారు. మేయర్‌కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. మొత్తానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!