GHMC: నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ!
- నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం
- వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడమే ఎజెండా
- కౌన్సిల్ సమావేశానికి సిద్దమైన ప్రధాన పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను రూ.8,340 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు.
బడ్జెట్‌లో పెట్టిన ప్రతిపాదనపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తి ఉన్నారు. పార్టీ ఫిరాయించిన మేయర్‌పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు. ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదని బల్దియా వర్గాలు అంటున్నాయి. కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు టార్గెట్ చేయనున్నారు. కౌన్సిల్‌లో మేయర్‌ను నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశంపై రాష్ట్ర రాయకులతో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
మరోవైపు కౌన్సిల్‌లో ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ కూడా వ్యూహారచన చేసింది. నిన్న సాయంత్రం ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మేయర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భేటీ అయ్యి కౌన్సిల్ వ్యూహాలపై చర్చించారు. ఈ రోజు ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో కాంగ్రెస్ కార్పొరేటర్లకు మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తానికి ఇరు పార్టీల తీరుతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగనుంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!