గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
బొంతు రామ్మోహన్. GHMC మాజీ మేయర్. ఇక్కడ చూస్తున్నది ఆయన పుట్టినరోజు వేడుకలే. గతంలో కూడా ఆయన బర్త్‌డే వేడుకలు చేసుకున్నా.. ఈ ఏడాది మాత్రం స్పెషల్‌గా చెబుతున్నారు. పుట్టినరోజు వేడుకలను బలప్రదర్శనకు వేదికగా మార్చేసి పార్టీలో చర్చగా మారారు మాజీ మేయర్. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ఈ ఎత్తుగడలు.. అనుచరులతో పరేడ్‌లు అని టీఆర్ఎస్‌లో చర్చ సాగుతోంది. వాస్తవానికి మేయర్‌గా ఉన్న సమయంలోనే ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా…
సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నాం. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలెక్ట్ చేస్తున్నారు. 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటిఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు. కొద్ది…
మేడమ్ బాగా బిజీ. విపక్షాలకే కాదు.. అధికారపక్షానికి కూడా అందుబాటులో ఉండరట. ఇన్నాళ్లూ ఈ అంశంపై లోలోనే మథన పడుతున్న స్వపక్షీయులు.. టైమ్ రాగానే ఫిర్యాదు చేసేశారు. అదికూడా.. మేడమ్ సమక్షంలోనే చెప్పాల్సినవి చెప్పేయడంతో.. ఈ ఎపిసోడ్ అధికారపార్టీలో ఆసక్తికర చర్చగా మారింది. మేయర్‌పై సొంతపార్టీ కార్పొరేటర్లే గుర్రు..! గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ మేయర్. మహానగరంలో కీలక పదవిలో ఉన్నారామె. సిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. స్పందించాల్సింది నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మే. కానీ..…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు జీహెచ్‌ఎంసీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. మేయర్ ఛాంబర్‌లోకి ఒక్కసారి దూసుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మేయర్ ఛాంబర్ రణరంగంగా మారింది. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్పొరేటర్లను మేయర్ ఛాంబర్ నుంచి బయటకు పంపించారు. అంతేకాకుండా మేయర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను అతికించారు. 5 నెలల క్రితం వర్చువల్ మీటింగ్ పెట్టినా ఎలాంటి…