Hyderabad: హైదరాబాద్‌లో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్
- లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి లైంగిక దాడి
- నిర్మానుష్య ప్రదేశంలో బెదిరించి దాడి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి
- బాధితురాలు జర్మనీ దేశస్థురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు. పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన నగరంలో మహిళా భద్రతపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది.
READ MORE: BV Raghavulu : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో బీవీ రాఘవులు
Also Read
బాధితురాలు జర్మన్ యువతి.. సెలవులు కోసం హైదరాబాద్ వచ్చింది. తన ఫ్రెండ్ తో కలిసి హైదరాబాదులోని మందమల్లమ్మ ఫంక్షన్ వద్ద ఉంటుంది. షాపింగ్ కోసం కారులో బయలుదేరింది. యువకులు.. కారును అడ్డగించి బలవంతంగా లోపలికి ఎక్కారు. ఆమెను తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు జర్మన్ యువతి చేసింది. ఫిర్యాదు పైన విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులు ఎవరు అన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!