జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక అల్గారిథమ్‌తో ముందుకు వచ్చింది. సవరణలతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే .. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పడేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
లింగ సమానత్వంలో భారత్ స్థానం మెరుగుపడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 8 స్థానాలు మెరుగుపడింది. గత ఏడాదిలో ప్రపంచ సూచీలో 135వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది అది కాస్త 127వ స్థానంలోకి వచ్చింది.
Gender Equality-UN Report: ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం పూర్తిస్థాయిలో లింగ సమానత్వం సాధించడానిక మరో 300 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని సంక్షోభాలు అసమానతలను తీవ్రం చేశాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం చట్టపరమైన రక్షణలో అంతరాలను, వివక్షాపూరిత చట్టాలను తొలగించేందుకు మరో 286 ఏళ్లు పడుతుందని.. అలాగే అధికారం, నాయకత్వ స్థానాల్లో…