గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గాజాను స్వాధీనం చేసుకోమని.. హమాస్ అంతమే లక్ష్యమని నెతన్యాహు చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని తమ ప్రభుత్వ అధిపతి ఇస్సామ్ అల్-దాలిస్ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారని హమాస్ ధృవీకరించింది . ఈ దాడుల్లో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధిపతి మహమూద్ అబు వాట్ఫా, అంతర్గత భద్రతా సేవ డైరెక్టర్ జనరల్ బహ్జత్ అబు సుల్తాన్ కూడా తుది శ్వాస విడిచారు. కీలక నాయకులు, వారి కుటుంబాలతో పాటు జియోనిస్ట్ ఆక్రమణ దళాల విమానాల ప్రత్యక్ష దాడిలో అమరులయ్యారని హమాస్ ప్రకటనలో పేర్కొంది. తాజా ఉద్రిక్తత…
Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నేలకూల్చే వరకు ఇజ్రాయిల్ విశ్రమించేలా కనిపించడం లేదు.
ఇజ్రాయెల్ మరోసారి విజృంభించింది. గాజాపై బాంబులతో విరుచుకుపడింది. గాజా నగరంపై టెల్ అవీవ్ దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి.
Mass Shooting : గాజాకు సాయంపై నిషేధం విధించిన తర్వాత పాలస్తీనియన్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. గురువారం సాయం కోసం ఎదురుచూస్తున్న పౌరులపై ఇజ్రాయెల్ ఆర్మీ బహిరంగ కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.