గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా పర్యటనల్లో క్రికెటర్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో ప్లేయర్ వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ నిబంధనలు అమల్లోకి వస్తే.. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ…
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం అయినప్పటి నుంచి భారత జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు. కీలక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్లపై గౌతీ సిరీస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్, గంభీర్‌కు మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అందులకే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో మోర్కల్ జట్టుతో…
బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఐదేళ్ల ముందు వరకు ఉన్న రూల్స్ మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ టూర్ కు టీమ్ వెళ్లినప్పుడు.. ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఘోర వైఫల్యంతో సీనియర్ ప్లేయర్స్ కెరీర్ల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పర్యటనలోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలా భవితవ్యం మీదా సుధీర్ఘ చర్చ కొనసాగుతుంది.
BCCI Review Meeting: భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో పరాజయం పాలవడంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రదర్శనపై సీరియస్ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓటమి, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి గల కారణాలపై…
ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ 3-1తో ఓడిపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత మాజీలు కూడా గంభీర్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించాడు. గంభీర్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదన్నారు. ప్రధాన కోచ్‌గా ఉన్నపుడు భారత్‌కు చెందిన వారిని సహాయక కోచ్‌లుగా తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో తనకు, గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు…
గత కొన్ని నెలలుగా భారత జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. స్వదేశంలో న్యూజీలాండ్ చేతిలో వైట్‌వాష్.. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరు గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉందని, ఈ ఆరు నెలల్లో ఏమైంది? అని ప్రశ్నించారు. పేరున్న ఆటగాళ్లని కాకుండా.. బాగా ఆడే ప్లేయర్లనే ఎంపిక చేయాలని సూచించారు. జస్ప్రీత్…
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్‌పై కీలక కామెంట్స్ చేశాడు.
RIP GOUTAM GAMBHIR: టీమిండియా ఐదో టెస్టులో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్రికెట్ అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మను ఐదో టెస్ట్ నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “RIP Gautam Gambhir” అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి వేలాదిగా ట్వీట్లు చేస్తున్నారు. గంభీర్ టీమ్ మేనేజ్మెంట్లో…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.