IND vs ENG Test Series: ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ ఓ సవాలుతో కూడిన అధ్యాయం. స్వింగ్, సీమ్‌కు ప్రసిద్ధమైన ఇంగ్లాండ్ పిచ్ లపై భారత్ కు విజయం సాధించడం ఎప్పుడూ కష్టసాధ్యమే. 1932లో మొదటిసారిగా ఇంగ్లాండ్ టూర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురమైన, సవాలుతో కూడిన క్షణాలను భారత జట్టు అనుభవించింది. ఇప్పడు, 2025లో ఇంగ్లాండ్‌లో 18 ఏళ్లుగా సాధించలేని టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించేందుకు కొత్త కెప్టెన్…
Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకస్మికంగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లిన టీమిండియా జట్టును వదిలి భారత్‌కు తిరిగి వచ్చారు. జూన్ 20న ప్రారంభమయ్యే భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ముందు, అతను స్వదేశం చేరుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం.. గంభీర్ తన తల్లి ఆరోగ్యం కారణంగా భారత్ కు చేరుకున్నాడు. అందిన సమాచారం మేరకు జూన్ 11న గంభీర్ తల్లి శీమా గంభీర్…
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. శుభ్‌మాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి…
తాను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్‌తో కూడుకున్నదని, ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ…
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముంది. పనిభార నిర్వహణలో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదని జట్టు ఎంపిక సందర్భంలోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. బుమ్రా లేకున్నా భారత జట్టుపై ప్రభావం పడదని, అతడి గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం…
ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషాద ఘటనపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంబరాల కంటే జనం ప్రాణాలు ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్ షోలు అవసరం లేదన్నారు. ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో ముంబైలో కెప్టెన్ శుభ్‌మన్…
Gautam Gambhir: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల కోసం రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదని.. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత…
Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యాటర్లు వన్డే ఫార్మెట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఫిట్నెస్ సహకరిస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారు. వారిద్దరిని ఎలాగైనా 2027 ప్రపంచ కప్ లో ఆడించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. Read Also: Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..! కానీ, అక్కడ గంభీర్ ఉండగా అది సాధ్యపడేలా…
టీమిండియా ప్రమాదంలో పడనుందా..? యంగ్ స్టార్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా? రెండు దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుంది. దీనికి ఎవరు కారణం? గంభీర్ నిర్ణయాలు కొంపముంచుతున్నాయా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో రెడ్ బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్దకాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు…