India WTC Ranking Drop: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమి పర్యవసానాలను భారత జట్టు ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో గట్టిగానే చవిచూసింది. ఓటమి అనంతరం WTC పాయింట్ల పట్టికలో టీమిండియా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి పడిపోయింది. కోల్‌కత్తాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడవ రోజునే భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పర్యాటక జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో ప్రపంచ…