విశాఖ నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయం కలకలం రేపుతోంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి మతపదార్థాలు రవాణా సంబంధించి అనేక కేసులు నమోదవుతున్న విషయం తరచూ వింటూనే ఉన్నాం. మత్తు పదార్థాల్లో ఎక్కువగా తీసుకునే వాటిలో ఒకటైన గంజాయి రోజురోజుకి మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారి తన రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటివరకు మనం గంజాయిని కేవలం ఆకుల రూపంలోనే చూసే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు చాక్లెట్లు, పౌడర్ లోకి వచ్చేసాయి. ఇదే క్రమంలోనే గంజాయితో చేసిన మిల్క్ షేక్…
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేకచోట్ల గంజాయి, మాదక ద్రవ్యాలకి సంబంధించిన పలు కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అనేక చోట్ల దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసులు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల మాదకద్రవ్యాలకి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి చూశాయి. Also Read: Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన…
Ganja Chocolates: నగరంలో గంజాయి గ్యాంగ్ రూటు మార్చింది. నిన్న మొన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయిస్తే ఇప్పుడు చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. గతంలో హవారా బ్యాచ్,
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా గంజాయి రవాణా కాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీసనర్ జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. గత రాత్రి ఓడిస్సా , ఎపి రాష్ర్టాల మీదుగా గంజాయి చాక్లెట్స్ హైదరాబాద్ కు తరలుతున్న వాటిని ఎక్పైజ్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఖమ్మంలో గంజా చాక్లెట్స్ పట్టుకోవడం ఇదే ప్రదమం.. హైదరాబాద్ లో చాక్లెట్లను ఒక్క చోట అప్పగించవలసిన ఉన్నదని నిందితులు చెప్పారని అంటున్నారు. దీని మీద ఇంకా లోతుగా…
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు.