పదేళ్ళ క్రితం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్… గడిచిన దశాబ్దంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. ‘రాజీ’ తర్వాత ఆమె నటించిన అలాంటి మరో సినిమా ‘గంగూబాయి కఠియావాడి’. ముంబైలోని అతి పెద్ద వేశ్యావాటిక కామాటిపురాలోని గంగూబాయి అనే నాయకురాలి జీవితం ఆధారంగా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా ఇది. అనేక సార్లు…