ఉత్తరప్రదేశ్ క్రైమ్ కు అడ్డగా మారింది. నిత్యం యూపీలో అత్యాచారాలు, హత్యలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాష్ట్రంలో మాఫియాకు చోటు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.