సోమవారం ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా నది ఒడ్డున భక్తులు సోమవతి అమావాస్యను జరుపుకున్నారు. హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో భక్తులు తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని స్నానం, దాన, పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.
Haridwar: ఉత్తరాఖండ్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ నుంచి తన మేనల్లుడిని కాపాడాలని వెర్రితనం 4 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, గంగా నదిలో 5 నిమిషాల పాటు నీటిలో ముంచితే అద్భుతం జరుగుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది.
ఆదివారం భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడానికి బీజేపీనే కారణమని బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. "బీజేపీ వంతెన కూలిపోవడానికి కారణమైంది. మేము వంతెనలను నిర్మిస్తాము.. బీజేపీ వాటిని నాశనం చేస్తూనే ఉంది" అని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు మద్ధతుగా రేపు రైతులు పెద్ద సంఖ్యలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మైనర్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈరోజు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు.
సికింద్రాబద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో వెయిటింగ్ లిస్ట్ 400ను దాటింది. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయిటింగ్ చూపుతున్నా.. ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపడం లేదు.
Girl Was Sold For Phone : మొబైల్ ఫోన్ శరీరంలో ఓ పార్టులా మారిపోయింది. మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ వచ్చేస్తోంది. యువత కూడా కొత్త కొత్త మోడల్ ఫోన్ల వాడేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో విషాదం చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఐఐటీ రూర్కీ విద్యార్థి ఆదివారం ఇక్కడ నదిలో స్నానం చేస్తూ గంగానదిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.