Bridge collapse: బీహార్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 లేన్ వంతెన కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆదివారం నిర్మాణంలో ఉన్న వంతనె కూలిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఖగారియాలో రూ.1,700 కోట్ల వ్యయంతో అగువానీ సుల్తాన్‌గంజ్ గంగా వంతెనను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నెలలో తుఫాన్ కారణంగా ఈ వంతెన కొంత భాగం దెబ్బతింది. ఈ వంతెనన ఖగారియా, అగువానీ, సుల్తాన్ గంజ్ మధ్య గంగా నదిపై నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ వంతెనలో కొంత భాగం కూలిపోయింది.
Read Also: Virender Sehwag: మనసున్నోడు మా వీరు.. రైలు ప్రమాదంలో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
వంతెన కూలిపోయిన ఘటనలో బీహార్ సీఎం, ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కమీషన్లు కోరే సంప్రదాయం జేడీయూ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉందని, రాజకీయ అస్థిరత వల్ల పరిపాలనలో అరాచకం, అవినీతి ఉందని, వ్యవస్థ కుప్పకూలుతోందని, కానీ వారు ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడుతున్నారని జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది బీజేపీ. అంతకుముందు డిసెంబర్ 2022లో, బీహార్‌లోని బెగుసరాయ్‌లో బుర్హి గండక్ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయింది. దీనికి నెల రోజుల ముందు, నవంబర్‌లో, సీఎం నితీష్ కుమార్‌కు చెందిన నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక కార్మికుడు మరణించాడు. ప్రారంభోత్సవానికి ముందే కిషన్‌గంజ్ మరియు సహర్సా జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూడా కూలిపోయాయి.
आज बिहार में भागलपुर के सुल्तानगंज और खगड़िया के बीच गंगा नदी पर बन रहा पुल भरभरा कर गिर गया। 2015 में नीतीश कुमार ने इस पुल का उद्घाटन किया था जिसका निर्माण 2020 तक पूरा होना था।
ये पुल दूसरी बार गिरा है। क्या नीतीश कुमार और तेजस्वी यादव इस घटना का संज्ञान लेते हुए तुरंत… pic.twitter.com/A08lE0THbk
— Amit Malviya (@amitmalviya) June 4, 2023