జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కలపడంతో ‘కొండా’ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక శుక్రవారం మరో ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్…
‘వలయం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య తో ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, ”డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండి…