ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహంపై గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. అలాగే మట్టి విగ్రహమే పెడతామని ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది.. కాగా, ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని…
వినాయక చవిత వచ్చిందంటే గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు, నిమజ్జనానికి ప్రత్యేకస్థానం ఉంది.. ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరే మహా గణనాథుడి విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ప్రత్యేకమనే చెప్పాలి.. ఒక్కోఏడాది ఒక్కోరూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను ఇవాళే ఆవిష్కరించింది ఉత్సవ కమిటీ.. పంచముఖ రుద్ర మహాగణపతిగా భారీ గణనాథుడి దర్శనమివ్వనుండగా.. మండపంలో గణనాథుడికి ఎడమ…