హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేయడంతో ట్యాంక్ బండ్ వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబందించిన ఏర్పాట్లును నిర్వహకులు వేగంగా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అనుమతిని రద్దు చేశారు. రేపు తెల్లవారుజామున 3…
హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేసింది.…
గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము అని మంత్రి తలసాని అన్నారు. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం అని తలసాని తెలిపారు. మరొక రోజులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నాం. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు…
ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టిహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోమని సూచించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలింది. అయితే, ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని కోరింది సర్కార్..…
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ…