మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో 14 మంది నీటిలో మునిగి మరణించారని పోలీసులు వెల్లడించారు.
Vishakapatnam: విశాఖపట్నం నగర శివారులోని గాజువాకలో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహానికి ముప్పు పొంచి ఉంది. 89 అడుగుల గణేష్ విగ్రహం కూలిపోతుందేమోనని స్థానిక పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ భారీ వినాయకుడి మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో తనిఖీలు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను పోలీసులు కోరారు. తనిఖీ చేసిన ఆర్ అండ్ బీ అధికారులు ఈ భారీ విగ్రహం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని నివేదిక…
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా వాన ఆటంకంగా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డులు దెబ్బతినడంతో.. గణేష్ నిమజ్జనానికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ అంతా సోభాయమానంగా మారింది. నిమజ్జనానికి వచ్చే భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్…
ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సాగనుంది. ఇప్పటికే గణేష్ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది. నగరంచుట్టూ ఉన్నప్రాంతాల్లో కూడా గణపయ్యకు బైబై చెప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి నిమజ్జనానికి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. అరభైఏడు సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయకుడు సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్…
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. శుక్రవారం హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం ఉన్న నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా.. మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం.. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు…
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది.. తొమ్మిదిరోజుల పాటు గణపయ్యను భక్తి శ్రద్ధలతో.. భజన కీర్తనలు, ఆటాపాటలతో కొలిచిన భక్తులు.. ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సమయం దగ్గర పడింది.. సాధారణంగా.. గణేష్ చవితి మలి రోజు నుంచే.. చిన్ని చిన్న వినాయకులు మొదలు… కొన్ని పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ వస్తుంటారు.. కానీ, హైదరాబాద్ లోని మహా నిమజ్జన కార్యక్రమం మాత్రం రెండు రోజుల పాటు సాగుతోంది.. బాలాపూర్ గణపతి…