Shraddha Das : సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. ఈ బెంగాలీ బ్యూటీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో వచ్చిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని చిన్న మూవీల్లో మెరిసింది. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు లేవు. టీవీల్లో అప్పుడప్పుడు కనిపిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా ఆమె చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఆమె ఉంటున్న అపార్టుమెంట్ వినాయకుడి నిమజ్జనంలో డప్పుకొట్టింది. మేళతాలాలు వాయించింది.
Read Also : JR NTR : తండ్రిపై జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
రోడ్డుపై తీన్మార్ డ్యాన్స్ చేస్తూ నానా రచ్చ చేసింది. తాను హీరోయిన్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి సాదాసీదాగా ఎంజాయ్ చేసింది. సాధారణంగా హీరోయిన్లు చాలా వరకు స్టైలిష్ గా బిహేవ్ చేయాలని అనుకుంటారు. కానీ శ్రద్దాదాస్ ఇలా రెచ్చిపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాటు స్టెప్పులు వేస్తూ దుమ్ము లేపింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
Read Also : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం
Visarjan 🤩🤩🤩, the best Ganesh Chaturthi ever 🎊🥳🪅#ganeshchaturthi2025 pic.twitter.com/9Xoww723qz
— Shraddha das (@shraddhadas43) September 1, 2025